logo

రేపు రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ శిబిరం

కొత్తగూడెంలోని కేసీఓఏ క్లబ్‌లో మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను ఈ నెల 19న నిర్వహించనున్నారు.

Published : 18 Jun 2024 05:43 IST

కొత్తగూడెం సింగరేణి, న్యూస్‌టుడే: కొత్తగూడెంలోని కేసీఓఏ క్లబ్‌లో మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ నిర్ధారణ పరీక్షలను ఈ నెల 19న నిర్వహించనున్నారు. సింగరేణి ఉద్యోగినులు, ఉద్యోగుల కుటుంబాలకు చెందినవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి చెందిన వైద్య నిపుణులు, సిబ్బంది పరీక్షలు చేస్తారని సింగరేణి వైద్యాధికారి డా.సుజాత తెలిపారు. ఆసక్తిఉన్నవారు ఈ నెల 18వ తేదీ సాయంత్రంలోపు ప్రధాన వైద్యశాలలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని