logo

కళ తప్పిన వైరా జలాశయం

మధ్యతరహా వైరా జలాశయం వెలవెలబోతుంది. వానాకాలం సీజన్‌లో మూడో వారం గడుస్తున్నా జలాశయానికి చుక్క నీరు చేరలేదు.

Published : 18 Jun 2024 05:46 IST

మధ్యతరహా వైరా జలాశయం వెలవెలబోతుంది. వానాకాలం సీజన్‌లో మూడో వారం గడుస్తున్నా జలాశయానికి చుక్క నీరు చేరలేదు. మరోవైపు ఇంకా ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండటంతో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతుంది. పూర్తిస్థాయి నీటిమట్టం 18.4 అడుగులు కాగా సోమవారం నాటికి నీటిమట్టం 6.1 అడుగులకు చేరింది. గత ఎనిమిదేళ్లలో ఇంత తక్కువ స్థాయిలో నీటిమట్టం నమోదు కావడం ఇదే తొలిసారి. వరుణుడు ముఖం చాటేస్తుండటంతో పరిస్థితి మరింత ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. నిత్యం పన్నెండు మండలాలకు తాగునీటిని అందించాల్సి ఉంది. మరో వైపు నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఇప్పటి వరకు చేపల వేటకు అనుమతి ఇవ్వడం లేదు. రెండు నెలల క్రితమే చేపల వేట ప్రారంభిద్దామని మత్స్యకారులు భావించినా నీరు కలుషితమవుతాయనే ఆందోళనతో అనుమతి ఇవ్వకుండా నిలిపివేశారు. జలాశయంలో చేపలు, రొయ్యలు పుష్కలంగా ఉన్నప్పటికి నీటిమట్టం తక్కువగా ఉండటంతో మత్స్యకారులకు ఇంకా నిరాశ తప్పడం లేదు. జలకళలేని జలాశయాన్ని ఇంత ప్రతికూలంగా చూడలేకపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని