logo

వరుణుడి అలక... సాగని అరక

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. ఇంతవరకు రైతులు ఆశించిన స్థాయి వర్షాలు కురవలేదు.

Updated : 18 Jun 2024 06:48 IST

టేకులపల్లి మండలం కోయగూడెంలో పత్తి పొలంలో మొలకశాతాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయశాఖ అధికారులు 

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు దోబూచులాడుతున్నాయి. ఇంతవరకు రైతులు ఆశించిన స్థాయి వర్షాలు కురవలేదు.   మే 31వ తేదీనే తెలుగు రాష్ట్రాలకు రుతుపవనాలు వచ్చేస్తున్నాయని భారత వాతావరణశాఖ ప్రకటించి అన్నదాతల్లో ఆశలు రేకెత్తించింది. పత్తి, పెసర, కంది, మొక్కజొన్న తదితర పంటలు సాగు చేసేందుకు ఇదే సరైన సమయం. ఈనెల మొదటి వారంలోనే పంట సాగు పననులు ముమ్మరం కావాల్సి ఉంది. రెండోవారం పూర్తయినా వరుణుడు కరుణించలేదు. ఇప్పటికే చాలామంది రైతులు పొడి దుక్కుల్లో, అరకొరగా  కురిసిన వర్షాలకు విత్తనాలు వేశారు. కొన్ని మొలకలు  రాకపోగా, మరికొన్ని ప్రాంతాల్లో మొలక శాతం చాలా  తక్కువగా ఉంది. దీని ప్రభావం దిగుబడులపై గణనీయంగా పడుతుంది. దుక్కులు సిద్ధం చేసిన అన్నదాతలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. కానీ రుతుపవనాలు మరింత   ఆలస్యమవుతున్నాయి. విత్తుకునేందుకు మరికొంత సమయం ఉన్నప్పటికీ సీజన్‌ ప్రారంభంలోనే కాలం కలిసి రాకపోవడంతో కర్షకులు ఆందోళన చెందుతున్నారు. 

  • అధిక వర్షపాతం నమోదైన మండలాలు: కరకగూడెం, చర్ల, ఆళ్లపల్లి, గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, సుజాతనగర్, భద్రాచలం
  • సాధారణ వర్షపాతం: అశ్వాపురం, జూలూరుపాడు, చుంచుపల్లి, బూర్గంపాడు
  • లోటు వర్షపాతం: పినపాక, మణుగూరు, చంద్రుగొండ,  కొత్తగూడెం, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట
  • అత్యల్ప వర్షపాతం: దుమ్ముగూడెం, అన్నపురెడ్డిపల్లి, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని