logo

ప్రభుత్వ భూమి.. ఆక్రమణపాలు

రెండు నెలల నుంచి ఇల్లెందు పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది నాయకులు, అధికారుల అండదండలతో భూములు ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి.

Published : 18 Jun 2024 05:54 IST

స్టేషను బస్తీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన స్తంభాలు, కర్రలు 

ఇల్లెందు, న్యూస్‌టుడే: రెండు నెలల నుంచి ఇల్లెందు పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది నాయకులు, అధికారుల అండదండలతో భూములు ఆక్రమించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలోని పురపాలక, సింగరేణి స్థలాలతోపాటు, 19వ వార్డులోని రైల్వే స్థలం ఆక్రమణకు గురైనా సంబంధిత అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదనుగా స్టేషను బస్తీలోని 20వ వార్డులో రెండు రోజులుగా సుమారు రెండున్నర ఎకరాల ప్రభుత్వ భూమిలో కొంతమంది స్తంభాలు, కర్రలు పాతి స్థలాన్ని నిలుపుకొన్నారు. స్థలం ఆపిన వారిలో ఇళ్లు లేనివారు కొంతమంది ఉంటే, ఇళ్లున్న వారూ దర్జాగా కబ్జా చేశారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పురపాలక అధికారులు అటుగా కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.

ఫ్యాక్టరీ ఏర్పాటుకు తీర్మానం..

స్టేషను బస్తీలో ఆక్రమణకు గురైన రెండున్నర ఎకరాల భూమి రెవెన్యూ   అధికారుల పరిధిలో ఉండేది. గత ఎమ్మెల్యే బానోత్‌ హరిప్రియ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ బస్‌ డిపో, కోల్డ్‌ స్టోరేజీ, కమ్యూనిటీ హాల్, ప్రకృతి వనంలో ఏదో ఒకటి నిర్మించాలని నిర్ణయించారు. ఆ సమయంలో స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు పురపాలికకు దాన్ని అప్పగించారు. పట్టణ ప్రగతిలో భాగంగా పురపాలిక ఆధ్వర్యంలో స్థలాన్ని రూ.లక్షలు పెట్టి శుభ్రం చేయించారు. ఎంఎస్‌ఎంఈ ద్వారా ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని పురపాలకవర్గంలో తీర్మానించారు. అయితే ప్రస్తుతం ఆ స్థలం కబ్జాకు గురైంది.


చర్యలు తీసుకుంటాం 
సతీష్, పట్టణ ప్రణాళిక అధికారి

ప్రభుత్వ స్థలం ఆక్రమించిన విషయం మా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపించాం. విచారణ చేపడుతున్నాం. ప్రభుత్వ స్థలం ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని ఖాళీ చేయిస్తాం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని