logo

నిలిచిన ప్రసవ శస్త్రచికిత్సలు

ఇల్లెందు సీహెచ్‌సీ ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. వైద్యురాలు ప్రసూతి సెలవుపై వెళ్లడంతో  నెల రోజుల నుంచి ఆపరేషన్లు ఆగిపోయాయి. కేవలం సాధారణ   ప్రసవాలకే వైద్యశాల పరిమితమైంది. 

Published : 20 Jun 2024 02:14 IST

ఇల్లెందు, న్యూస్‌టుడే

ఇల్లెందు సీహెచ్‌సీ ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవ శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. వైద్యురాలు ప్రసూతి సెలవుపై వెళ్లడంతో  నెల రోజుల నుంచి ఆపరేషన్లు ఆగిపోయాయి. కేవలం సాధారణ   ప్రసవాలకే వైద్యశాల పరిమితమైంది. 

ల్లెందు పట్టణ, మండలంతోపాటు టేకులపల్లి, గుండాల, ఆళ్లపల్లి, కారేపల్లి మండలాల్లో ఏజెన్సీ గ్రామాల నుంచి కాన్పులు, వైద్య పరీక్షల కోసం నిత్యం 50 మంది గర్భిణులు వైద్యశాలకు వస్తుంటారు. గతంలో సీహెచ్‌సీలో గైనకాలజిస్టు లేకపోవడంతో ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయించేవారు. కాన్పు కోసం రూ.30వేల నుంచి రూ.50వేలు ఖర్చయ్యేది. ఏడాదిన్నర క్రితం ప్రసూతి వైద్యురాలి నియామకంతో ఇబ్బందులు తొలగాయి. కానీ నెల రోజుల నుంచి గైనకాలజిస్టు లేకపోవడంతో సుమారు 30 మంది గర్భిణులను ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల వైద్యశాలలకు రిఫర్‌ చేశారు. 50 కిలోమీటర్ల దూరంలోని జిల్లా వైద్యశాలలకు వెళ్లలేనివారు, అత్యవసర పరిస్థితుల్లో స్థానిక ప్రైవేటు వైద్యశాలలను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం వైద్య పరీక్షలు జరగడం లేదు.  ఉన్నతాధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


‘ప్రసవ వైద్యురాలు మెటర్నటీ సెలవుపై వెళ్లారు. ఆమె వచ్చే  వరకు వేరే వైద్యులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపడుతున్నాం. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.’

హర్షవర్ధన్, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని