logo

నులి పురుగులను నలిపేద్దాం

చేతుల అపరిశుభ్రత కారణంగా కడుపులోకి చేరే నులి పురుగులు పిల్లల రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తాయి. చేతుల పరిశుభ్రతతో విద్యార్థి దశలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Updated : 20 Jun 2024 05:26 IST

చేతుల అపరిశుభ్రత కారణంగా కడుపులోకి చేరే నులి పురుగులు పిల్లల రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తాయి. చేతుల పరిశుభ్రతతో విద్యార్థి దశలో ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేతివేలి గోళ్లల్లో చిక్కుకున్న మట్టి కడుపులోకి చేరకుండా అవగాహన కల్పించాలని, ఎక్కువగా తీపి వస్తువులు తినకుండా చూడాలని   సూచిస్తున్నారు. 1-19 ఏళ్లలోపు వారికి గురువారం నుంచి నులి పురుగుల నివారణ మాత్రలు పంపిణీ చేసేందుకు వైద్యారోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది. 

నేడు మాత్రల పంపిణీ.. 

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చేపట్టే కార్యక్రమాలకు సంబంధించి మండల, జిల్లాస్థాయి  వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ కేంద్రాల ఉద్యోగులకు శిక్షణలు ఇచ్చారు. జిల్లాలోని 1-19 ఏళ్ల లోపువారు పిల్లల్ని గుర్తించారు. వారందరికీ ఆల్బెండోజల్‌ మాత్రలు గురువారం అందజేస్తారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు అంగన్‌వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లనున్నాయి. 1 నుంచి 2 ఏళ్లలోపు వారైతే సగం, 2 నుంచి 19 ఏళ్లలోపు వారైతే పూర్తి మాత్రలు అందజేస్తారు. గురువారం మాత్రలు పొందనివారుంటే ఈనెల 27న ప్రత్యేక కార్యక్రమం (మాపప్‌ రౌండ్‌) నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ జేఎవీల్‌ శిరీష ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మలబద్ధకం, ఆకలి మందగించడం, తరచూ జ్వరంతో బాధపడే పిల్లలను వెంటనే వైద్యనిపుణులకు చూపాలని సూచించారు. లేదంటే రక్తహీనత సమస్య తీవ్రమయ్యే ప్రమాదముందన్నారు. ]

కొత్తగూడెం వైద్యవిభాగం, న్యూస్‌టుడే 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని