logo

బడిబాట పట్టింది అరకొరే..!

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ‘బడిబాట’ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 6న ‘బడిబాట’ను అన్ని జిల్లాల్లో ప్రారంభించింది.   బుధవారంతో కార్యక్రమం ముగిసింది.

Published : 20 Jun 2024 02:22 IST

న్యూస్‌టుడే, పాల్వంచ

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా ‘బడిబాట’ చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ నెల 6న ‘బడిబాట’ను అన్ని జిల్లాల్లో ప్రారంభించింది.   బుధవారంతో కార్యక్రమం ముగిసింది. కానీ, గతేడాది కంటే ప్రవేశాలు భారీగా తగ్గాయి. 

ప్రభుత్వ బడుల్లో మునుపటి కంటే వసతులు పెరిగాయి. ‘మన ఊరు, మనబడి/మన బస్తీ’, ‘అమ్మ ఆదర్శ కమిటీ’లతో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. తెలుగుతో పాటు ఆంగ్ల మాధ్యమాల్లో బోధన జరుగుతోంది. తరగతులు ప్రారంభించిన రోజే పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, ఏకరూప దుస్తులు పంపిణీ అయ్యేలా అధికారులు చొరవ     చూపారు. బడిబాట నిర్వహణ ఖర్చులనూ ప్రభుత్వం వెంటనే అందజేసింది. అయినా వివిధ కారణాలతో ఆశించిన స్థాయిలో ప్రవేశాలు కల్పించలేకపోవడం నిరాశ కలిగిస్తోంది. లోక్‌సభ, పట్టభద్రుల ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు తలమునకలవటం, తీవ్ర ఎండలు, బదిలీ, పదోన్నతుల ప్రక్రియ నేపథ్యంలో ఉపాధ్యాయులు అనుకున్న స్థాయిలో దృష్టిసారించలేకపోయారు. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కార్యక్రమం నామమాత్రంగా సాగినట్లు కనిపించింది. ‘అమ్మ ఆదర్శ కమిటీ’లను మరింత భాగస్వామ్యం చేసి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవి. కానీ ఉపాధ్యాయులు ఆ ప్రయత్నం సరిగ్గా చేయలేదు. ఫలితంగా గతేడాది 5,036 మందికి కొత్తగా ప్రవేశాలు కల్పించగా, ఈ ఏడాది ఆ సంఖ్య 1,498కి పరిమితమైంది.  


ప్రవేశాల ప్రక్రియ కొనసాగిస్తాం.. 

-వెంకటేశ్వరాచారి, జిల్లా విద్యాశాఖ అధికారి

‘బడిబాట’లో కల్పించిన ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాలను ఇంకా ‘స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌’లో చేర్చలేదు. కొందరు ఉపాధ్యాయులకు దీనిపై సరైన అవగాహన లేదు. బడిబాట ముగిసినా బయట పిల్లల గుర్తింపు కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. పాఠశాలల్లో ప్రవేశాలు ఆశాజనకంగా ఉండేలా చర్యలు చేపడతాం. ఈ విషయంపై ఉపాధ్యాయులకు    మరోమారు దిశానిర్దేశం చేస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని