logo

ఆయిల్‌పాం, బిందు సేద్యం రాయితీ నిధులు విడుదల

వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌పాం, బిందు సేద్యం రాయితీ నిధులు విడుదల చేసినట్లు జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి బీవీ రమణ బుధవారం తెలిపారు.

Published : 20 Jun 2024 02:24 IST

ఖమ్మం, వ్యవసాయం,న్యూస్‌టుడే:  వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయిల్‌పాం, బిందు సేద్యం రాయితీ నిధులు విడుదల చేసినట్లు జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి బీవీ రమణ బుధవారం తెలిపారు. ఆయిల్‌పాం రైతులకు రావాల్సిన నిర్వహణ, అంతర పంటల రాయితీతో పాటు బిందు సేద్యం పరికరాల రాయితీ నిధులు  విడుదలయ్యాయని తెలిపారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చెందిన ఆయిల్‌పామ్‌ తోటలకు 2,483 మంది రైతులకు  1,056.80 ఎకరాలకు రూ.3.72 కోట్లు, 159 మంది రైతులకు 725 ఎకరాలకు బిందు సేద్యం పరికరాలకు రాయితీ రూ.45.90 లక్షలు విడుదలైనట్లు వెల్లడించారు. వీటిని మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. బిందు సేద్యం పరికరాలకు రాయితీని డ్రిప్‌ కంపెనీలకు జమ చేస్తామని తెలిపారు. జిల్లాలో ఆయిల్‌పాం అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తానని, రైతులు ఈ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేయాలని మంత్రి తుమ్మల సూచించారని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని