logo

వైద్యసేవలపై కలెక్టర్‌ ఆరా

ఖమ్మం సర్వజనాసుపత్రిలో వైద్యసేవలపై కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆరా తీశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆస్పత్రిని బుధవారం సందర్శించారు.

Published : 20 Jun 2024 02:31 IST

ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: ఖమ్మం సర్వజనాసుపత్రిలో వైద్యసేవలపై కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఆరా తీశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన ఆస్పత్రిని బుధవారం సందర్శించారు. సాధారణ, శస్త్రచికిత్స, ప్రసూతి వార్డులను పరిశీలించారు. రోగులతో మమేకమవుతూ చికిత్సల తీరును అడిగి తెలుసుకున్నారు. ఎంసీహెచ్‌లో ఓపీ, ఐపీ, స్కానింగ్‌ విభాగాల సదుపాయాలను తిలకించారు. రోగులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. వైద్యాధికారులు, నర్సింగ్‌ ఆఫీసర్లు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని ఆదేశించారు. మెడికల్‌ సూపరింటెండెంట్‌ ఎల్‌.కిరణ్‌కుమార్, ఆర్‌ఎంఓ అమర్‌సింగ్, రాంబాబు పాల్గొన్నారు.


ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగిద్దాం..

ఖమ్మం విద్యావిభాగం: విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం కలిగించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. ఖమ్మంలోని ఇందిరానగర్‌ ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు.  విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.


ఖమ్మం నగరం: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు నూరు శాతం ఉండేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ అన్నారు. కలెక్టరేట్‌లో  విద్యాశాఖ అధికారులతో సమీక్ష జరిపారు. విద్యార్థి ఒక్కరోజు పాఠశాలకు గైర్హాజరైనా అందుకు కారణం తెలుసుకుని రిజిస్టర్‌లో నమోదు చేయాలని ఆదేశించారు. తరచూ విద్యార్థులు గైర్హాజరైతే సంబంధిత  హెచ్‌ఎం, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల కుటుంబ సభ్యులతో మాట్లాడి గైర్హాజరు తగ్గించాలన్నారు. విద్యార్థుల మాదిరిగా ఉపాధ్యాయుల హాజరు సైతం ముఖ్యమని, సమయపాలన పాటించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరును జిల్లాస్థాయి వరకు పర్యవేక్షించాలని ఆదేశించారు. డీఈఓ సోమశేఖరశర్మ, సీఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవికుమార్, సమన్వయకర్తలు రామకృష్ణ, భూలక్ష్మి, భానుప్రకాశ్, పాపారావు, ఎంఈఓలు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని