logo

అమ్మాపాడే జోలపాట గేయ రచయితకు సన్మానం

అమ్మపాడే జోలపాట రచయిత మిట్టపల్లి సురేందర్‌ను గురువారం గుండాలలో గ్రామస్థులు, విద్యావంతుల వేదిక యువకులు, గుండాల నివాసి గడ్డం సతీష్‌ ఆధ్వర్యంలో సన్మానించారు.

Published : 21 Jun 2024 05:55 IST

చిన్నారులతో ఆనందాన్ని పంచుకుంటున్న మిట్టపల్లి 

గుండాల, న్యూస్‌టుడే: అమ్మపాడే జోలపాట రచయిత మిట్టపల్లి సురేందర్‌ను గురువారం గుండాలలో గ్రామస్థులు, విద్యావంతుల వేదిక యువకులు, గుండాల నివాసి గడ్డం సతీష్‌ ఆధ్వర్యంలో సన్మానించారు. సతీష్‌ ప్రస్తుతం కొత్తగూడెంలో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం మిట్టపల్లి మూడు నెలలపాటు ఉమ్మడి గుండాల మండలంలో జానపద కళాబృందంతో కలిసి పర్యటించారు. పరిశుభ్రత తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యపర్చారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి వెళ్లిపోయే సందర్భంలో గుండాల మండలంలో ప్రవహిస్తున్న కిన్నెరసాని, ఇతర వాగులు, వంకలు, అడవుల్ని పరిశీలిస్తూ అమ్మను మనసులో తలుచుకొని పాట రాశానని తెలిపారు.  ఆ పాటను ఇటీవల బెంగళూరుకు చెందిన యువతితో పాడించడం జరిగిందన్నారు. తమను గుర్తించి ఎస్సై సతీష్‌ మండల ప్రజల సమక్షంలో సన్మానం చేయడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానని తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని