logo

జాతీయ రహదారిపై రెండు ఎగ్జిట్లకు అనుమతి

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ (ఎన్‌హెచ్‌-365బీజీ) జాతీయ రహదారిపై రెండు ఎగ్జిట్లకు అనుమతులు లభించాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Published : 21 Jun 2024 02:31 IST

జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో మాట్లాడుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

ఖమ్మం కమాన్‌బజార్, న్యూస్‌టుడే: ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ (ఎన్‌హెచ్‌-365బీజీ) జాతీయ రహదారిపై రెండు ఎగ్జిట్లకు అనుమతులు లభించాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో కలిసి  ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో పనుల పురోగతిపై గురువారం సమీక్ష నిర్వహించారు. జాతీయ రహదారుల పనులకు సంబంధించి  సూచనలు చేశారు. కల్లూరు-మధిర(లింగాల), సత్తుపల్లి-వేంసూరు(వేంసూరు)రహదారులకు అనుసంధానంగా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారికి ఎగ్జిట్లు ఇవ్వాలని గతంలో తుమ్మల ఎన్‌హెచ్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ను కోరారు. ఈ క్రమంలో వాటికి సంబంధించిన అనుమతులు లభించినట్లు మంత్రి వెల్లడించారు. ఖమ్మం నగరంలోకి ప్రవేశించే ఎంట్రీ పాయింట్ల, సర్వీసు రోడ్ల కోసం మూడు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని అధికారులకు సూచించారు. ధంసలాపురం-బోనకల్లు ఎగ్జిట్‌ పాయింట్, సర్వీసు రోడ్లకు సర్వే పూర్తి చేసి నివేదిక అందజేస్తామని అధికారులు వివరించారు. ఖమ్మం-విజయవాడ ఎన్‌హెచ్‌-163జి(నాగపూర్‌- అమరావతి కారిడార్‌) రహదారి, ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ ఫీల్డ్‌(ఎన్‌హెచ్‌-365బీజీ) రహదారిని కలిపే కొదుమూరు జంక్షన్‌ వద్ద     మార్గాలను పరిశీలించి సర్వీస్‌ రోడ్లతో కనెక్టివిటీ ఇవ్వాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో నగర మేయర్‌    పునుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని