logo

ఏడాదంతా ఆదాయం రా‘పట్టు’

రైతులు సంప్రదాయ పంటలతో నష్టపోకుండా పట్టుపరిశ్రమ చేపట్టి నెల వారీగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వరి, పత్తికి ప్రత్యామ్నాయ పంటగా మల్బరీ సాగుకు కర్షకులు ముందుకు రావాలి.

Published : 21 Jun 2024 07:00 IST

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: రైతులు సంప్రదాయ పంటలతో నష్టపోకుండా పట్టుపరిశ్రమ చేపట్టి నెల వారీగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. వరి, పత్తికి ప్రత్యామ్నాయ పంటగా మల్బరీ సాగుకు కర్షకులు ముందుకు రావాలి. తక్కువ నీటి వినియోగంతో ఒక సంవత్సరంలో ఎక్కువ పంటలు తీసుకోవచ్చు. ‘సమగ్ర సిల్క్‌ పథకం (2024-25) ద్వారా ప్రభుత్వం రాయితీలు ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలువురు రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు.

ధరలు ఆశాజనకం

ఖమ్మం జిల్లాలో మల్బరీ సాగు రైతులకు అండగా నిలుస్తోంది. రెండేళ్లుగా పట్టు గూళ్ల ధరలు కిలో రూ.400 పైబడి నిలకడగా ఉండటంతో సాగుదారులకు గిట్టుబాటు అవుతోంది. గతేడాది మార్కెట్‌లో ధరలు రూ.400 నుంచి రూ.600 వరకు పలికాయి. తెలంగాణ రాష్ట్రంలో జనగాం, హైదరాబాద్‌ మార్కెట్లలో నాణ్యతను బట్టి రూ.600 వరకు రైతులకు వ్యాపారులు ధర చెల్లించారు.

సాగుకు అనుకూలాంశాలు..

  • అతి తక్కువ నీటి వినియోగం
  • మల్బరీ మొక్కలను ఒకసారి నాటితే 10-15 ఏళ్ల వరకు పనికొస్తాయి. తిరిగి నాటాల్సిన పనిలేదు.
  • నల్లరేగడి, చౌడు భూములు మినహా మిగతా భూములు మల్బరీ సాగుకు అనుకూలమే.
  • మొదటి సంవత్సరం 3 పంటలు, రెండో సంవత్సరం నుంచి ఆరేడు తీసుకోవచ్చు.
  • క్రిమిసంహారక మందుల అవసరం ఉండదు.
  • దరఖాస్తు, ఇతర వివరాలకు కె.సురేశ్‌ (99667 57765), ఎ.శ్రీనివాసరావు (90005 01500) నంబర్లలో రైతులు సంప్రదించవచ్చు. 

సమగ్ర సిల్క్‌ పథకం రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. ఆసక్తి కలిగినవారు సమీపంలోని ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారులను సంప్రదించాలి. పట్టు పరిశ్రమ రైతులకు ఏడాది మొత్తం ఆదాయం అందుతుంది.

బీవీ రమణ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి, ఖమ్మం 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని