logo

రామోజీరావు ఆశయ సాధనకు పునరంకితమవుదాం

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు గొప్ప దార్శనికుడు అని ఉద్యోగులు, సిబ్బంది కొనియాడారు.

Updated : 21 Jun 2024 06:34 IST

ఖమ్మం ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయంలో రామోజీరావు చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది

రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ చెరుకూరి రామోజీరావు గొప్ప దార్శనికుడు అని ఉద్యోగులు, సిబ్బంది కొనియాడారు. ఖమ్మంలోని ‘ఈనాడు’ యూనిట్‌ కార్యాలయం, ఖమ్మం, కొత్తగూడెంలోని మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో రామోజీరావు సంస్మరణ సభలను గురువారం నిర్వహించారు. ‘ఈనాడు’, ‘మార్గదర్శి’ లాంటి సంస్థలతో పాటు రామోజీ ఫిలింసిటీ వంటివి రామోజీరావు నెలకొల్పి వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. రామోజీరావు ఆశయ సాధనకు పునరంకితమవుతామని ప్రతినబూనారు. రామోజీరావు చిత్రపటానికి నివాళి అర్పించారు. ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్‌ చిట్టిమళ్ల అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఈనాడు’ దినపత్రిక చదువుతూ ఎందరో యువతీయువకులు పోటీ పరీక్షల్లో ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. చిట్ రిజిస్ట్రార్‌ యామిని, ఖమ్మం ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి పోలవరపు శ్రీధర్‌లాల్, ఖమ్మం మార్గదర్శి బ్రాంచి మేనేజర్‌ పారుపల్లి హన్మంతరావు, ‘ఈనాడు’, ‘ఈటీవీ’, ‘మార్గదర్శి’, ‘ప్రియా ఫుడ్స్‌’ తదితర సంస్థల ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఖమ్మం అర్బన్, న్యూస్‌టుడే

ఖమ్మం ‘మార్గదర్శి’ బ్రాంచి కార్యాలయంలో రామోజీరావుకు నివాళి అర్పిస్తున్న ఉద్యోగులు, సిబ్బంది 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు