logo

Kammam: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు.

Updated : 18 Jun 2024 16:24 IST

ఏన్కూర్: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాసు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూర్‌లో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలు అమలు చేస్తుందని, వీటితో అనేకమంది బలహీన వర్గాల ప్రజలు లబ్ది పొందుతున్నారని అన్నారు. సీతారామ అనుసంధాన కాలువ పూర్తి చేసి వైరా నియోజకవర్గానికి తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వరలక్ష్మి, వైస్ ఎంపీపీ పాశం శ్రీనివాసరావు, తహసీల్దార్ శేషగిరిరావు, ఎంపీడీవో రమేష్, డీసీసీ జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు గుత్తా వెంకటేశ్వరరావు, స్వర్ణ నరేందర్, మేడా ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని