logo

Kurnool: జింకల పార్కును ఏర్పాటు చేయాలి

ఆస్పరి మండలంలో రైతులు వేసిన పంటలను నాశనం చేస్తున్న జింకలను పట్టి వేయాలని అఖిలభారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకుడు బోయ మునిస్వామి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

Published : 19 Jun 2024 16:47 IST

ఆస్పరి: ఆస్పరి మండలంలో రైతులు వేసిన పంటలను నాశనం చేస్తున్న జింకలను పట్టి వేయాలని అఖిలభారత రైతు మహాసభ సంఘం జిల్లా నాయకుడు బోయ మునిస్వామి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అర కొర వర్షాలకు పొలాల్లో వేసిన విత్తనాలను మొలకెత్తిన మొక్కలను జింకలు నాశనం చేస్తూన్నాయన్నారు. రైతులు పంట పొలాలను జింకల నుంచి కాపాడుకోవడానికి రాత్రి పగలు అన్న తేడా లేకుండా కాపలా కాస్తున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి జింకల పార్కును ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు