logo

Kurnool: కోనేరులో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

మండలంలోని మద్దిలేటి స్వామి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి  మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Published : 16 Jun 2024 18:25 IST

బేతంచెర్ల: మండలంలోని మద్దిలేటి స్వామి ఆలయంలోని కోనేరులో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి  మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గద్వాల మండలం వడ్డేపల్లికి చెందిన కురువ మహేష్ (34) అనే వ్యక్తి మద్దిలేటి స్వామి దర్శనం కోసం శనివారం మద్దిలేటి స్వామి ఆలయానికి వచ్చారు. ఉదయం 10 గంటల సమయంలో కోనేరులో ఈతకు వెళ్లాడు. గుంత ఉండడంతో అందులో మునిగి కనిపించలేదు. విషయం తెలుసుకున్న బంధువులు మహేష్‌ కోసం వెతికారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం  మృతదేహం బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసలు ఘటనా స్థలానికి చేరుకుని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శవ పరీక్ష నిమిత్తం బనగానపల్లెకు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని