logo

Kurnool: వైకాపా అక్రమ కట్టడంపై చర్యలు ఉంటాయి

ఆదోని పట్టణంలో వైకాపా నిర్మించిన నిర్మించిన పార్టీ కార్యాలయం అక్రమ కట్టడం అని భాజపా ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు.

Published : 25 Jun 2024 19:09 IST

ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో వైకాపా నిర్మించిన నిర్మించిన పార్టీ కార్యాలయం అక్రమ కట్టడం అని భాజపా ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఉద్యోగులకు చెందిన పాత ఎన్జీవో భవనాన్ని 99 ఏళ్లు లీజుకు తీసుకోవడం భూమి మీద ఎక్కడైనా ఉందా అంటూ ప్రశ్నించారు. అక్రమ ఒప్పందం చేసి ఇచ్చిన సదరు ఉద్యోగి సైతం తాజాగా రిటైర్డ్ అయ్యారని ఆయన పేర్కొన్నారు. ఫైవ్ స్టార్ స్థాయిలో కార్యాలయం నిర్మించి అక్కడ సెటిల్మెంట్లు చేసేవారని ఆయన ఆరోపించారు. చట్టం తన పని తాను చేసుకోబోతుందని. అనుమతులు లేని భవనంపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని