logo

Kurnool: ఉచిత ఇసుక పాలసీని తక్షణమే అమలు చేయాలి

ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీని తక్షణమే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ అన్నారు.

Published : 16 Jun 2024 16:21 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం:  ప్రభుత్వం ప్రకటించిన ఉచిత ఇసుక పాలసీని తక్షణమే అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వీరేష్ అన్నారు. ఆదివారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఏపీ బిల్డింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత వైకాపా ప్రభుత్వ హయాంలో  భవన నిర్మాణ కార్మికులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇసుకను వైకాపా ప్రభుత్వం వ్యాపార వస్తువుగా మార్చి ఇతర రాష్ట్రాలకు విక్రయించిందని ఆరోపించారు. దీనివల్ల భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేక కుటుంబాలు గడవక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే ఉచిత ఇసుక పాలసీని అమలు చేయాని విజ్ఞప్తి చేశారు.  కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు సుంకన్న,నరసప్ప,వీరేష్, రవి,నరసింహులు, అడివప్ప,నరసింహులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని