logo

ఎమ్మెల్యేను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ఎన్జీవోలు

ఎమ్మిగనూరు తాలూకా ఏపీ ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో సభ్యులు నూతనంగా ఎన్నికైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

Published : 16 Jun 2024 12:07 IST

ఎమ్మిగనూరు : ఎమ్మిగనూరు తాలూకా ఏపీ ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో సభ్యులు నూతనంగా ఎన్నికైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  బీవీ జయ నాగేశ్వర్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏపీఎన్జీవో సంఘ అధ్యక్షులు కె.మద్దిలేటి మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన  ప్రభుత్వంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే విధంగా  కృషి చేయాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏపీఎన్జీవోస్ తాలూకా కార్యదర్శి వరప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ , అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించేందుకు ముందు ఉంటామని, పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని తెలిపారు. వారి వెంట నాయకులు శివరామిరెడ్డి , సురేష్ , ప్రభు , రామకృష్ణ , బజారి ,  తిరుమల్ రెడ్డి , వెంకటేశ్వర్లు, గిరి ప్రసాద్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు మల్లికార్జున , లోకాస్ , చిన్న రాముడు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని