logo

అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులను చేర్పించాలి

అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని డీపీఈపీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  శ్రీనివాసులు, అంగన్వాడీ సిబ్బంది  నారాయణమ్మ, ఉపాధ్యాయులు జరీనా, శాంతి, సుజాత పేర్కొన్నారు.

Published : 13 Jun 2024 13:04 IST

గాజులపల్లె (మహానంది):  అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చిన్నారులను చేర్పించాలని డీపీఈపీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు  శ్రీనివాసులు, అంగన్వాడీ సిబ్బంది  నారాయణమ్మ, ఉపాధ్యాయులు జరీనా, శాంతి, సుజాత పేర్కొన్నారు. గురువారం  నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని  ప్రభుత్వ పాఠశాల హెచ్ఎం, 2,4,5 అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని, వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం, బాలామృతం ఇవ్వనున్నట్లు చెప్పారు.  అదేవిధంగా  ఐదేళ్లు దాటిన చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బంది మహేశ్వరమ్మ, షాహిన్ సుల్తానా, శిరీష తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని