logo

Kurnool: రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి

గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ నియోజక కార్యదర్శి మునిస్వామి డిమాండ్‌ చేశారు.

Published : 12 Jun 2024 19:12 IST

ఆస్పరి: గత ప్రభుత్వంలో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ పార్టీ నియోజక కార్యదర్శి మునిస్వామి డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2018 నష్టపరిహారం నేటికి ఇవ్వలేదన్నారు. తెదేపా ప్రభుత్వం రైతులను దృష్టిలో పెట్టుకొని నష్ట పరిహారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు రామన్న, నారాయణ, తిమ్మన్న, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని