logo

Kurnoool: వాలంటీర్ల ఆందోళన

ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం వార్డు వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు.

Published : 19 Jun 2024 15:19 IST

ఆదోని మార్కెట్: ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం వార్డు వాలంటీర్లు ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో వీరంతా రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, తాము వైకాపా నాయకుల ఒత్తిడి మేరకే రాజీనామాలు చేశాము తప్ప, మరే ఉద్దేశంతో చేయలేదన్నారు. ప్రస్తుతం ఉద్యోగాలు లేక ఇల్లు గడవక ఉపాధి అవకాశాలు దూరమై జీవనం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దయతలిచి తమ ఉద్యోగాలు తమకు ఇప్పించి తమ జీవనానికి తోడ్పాటు అందించాలని వారు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని