logo

Kurnool: నకిలీ విత్తనాలను అరికట్టాలి

ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు వైఫల్యం చెందుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్, పట్టణ కార్యదర్శి జి.రంగన్న అన్నారు.

Published : 19 Jun 2024 16:49 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: ఖరీఫ్ సీజన్‌లో వివిధ పంటలకు సంబంధించిన నకిలీ విత్తనాలు అరికట్టడంలో వ్యవసాయ శాఖ అధికారులు వైఫల్యం చెందుతున్నారని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) జిల్లా కార్యవర్గ సభ్యులు పంపన్న గౌడ్, పట్టణ కార్యదర్శి జి.రంగన్న అన్నారు. బుధవారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఖరీఫ్‌లో ముందస్తుగా వర్షాలు కురవడంతో రైతులు విత్తనాలు కొనుగోలు చేస్తున్నారు. అందువల్ల వ్యవసాయ శాఖ అధికారులు నకిలీ  విత్తనాలు విక్రయిస్తున్న దుకాణాల యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని