logo

CPI: అన్నదాతలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి

కొత్తగా ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీసీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అన్నారు.

Updated : 20 Jun 2024 19:09 IST

బిల్లేకల్లు,(ఆస్పరి): కొత్తగా ఏర్పడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని సీసీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య అన్నారు. గురువారం మండలంలోని బిల్లేకల్లు గ్రామంలో పంట పొలాల్లో రైతులు ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అథితులుగా సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, మండల కార్యదర్శి విరుపాక్షి, కృష్ణమూర్తి, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 90 శాతం రాయితీతో విత్తనాలు, ఎరువులు, రసాయనిక మందులు రైతులకు ఉపయోగపడే యంత్రాలు ఇవ్వాలని డిమాండు చేశారు. రైతులకు రుణాలు మాఫీ చేసి కేరళ తరహాలో రైతుకు అమలు చేయాలన్నారు. నాయకులు ఆంజనేయులు, ఉరుకుందప్ప, లక్ష్మన్న, హేమంత్, రమేష్, లక్ష్మన్న, హరి, యువరాజ్, రామచంద్ర, షఫీ, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని