logo

Nandyala: బాలికపై చిరుత దాడి

నంద్యాల జిల్లా గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్‌లోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండేపై చిరుత దాడి చేసింది.

Published : 13 Jun 2024 17:14 IST

నంద్యాల: నంద్యాల జిల్లా గిద్దలూరు నల్లమల ఘాట్ రోడ్‌లోని చలమ వద్ద 12 ఏళ్ల బాలిక పాండేపై చిరుత దాడి చేసింది. రైల్వే పనులు చేయడానికి చలమ వద్దకు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన కూలీల కుటుంబాలు వచ్చాయి. కూలీలందరూ పనులు చేస్తుండగా బాలికపై చిరుత దాడి చేసింది. ఈ దాడిలో పాండేకు గాయాలు కాగా.. కూలీలందరూ కేకలు వేయడంతో చిరుత పారిపోయింది. పాండేను నంద్యాల జీజీహెచ్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని