logo

Kurnool: సీఆర్పీ ఉద్యోగులకు డీఎస్సీలో వెయిటేజీ ఇవ్వాలి

ఏపీ 2024 డీఎస్సీలో ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్పీలకు వెయిటేజీ ఇవ్వాలని ఆ సంఘం జిల్లా నాయకులు కె పుల్లన్న కోరారు.

Published : 18 Jun 2024 19:24 IST

గోనెగండ్ల: ఏపీ 2024 డీఎస్సీలో ఏపీ సమగ్ర శిక్ష అభియాన్ కింద ఎంఈఓ కార్యాలయాల్లో పనిచేస్తున్న సీఆర్పీలకు వెయిటేజీ ఇవ్వాలని ఆ సంఘం జిల్లా నాయకులు కె పుల్లన్న కోరారు. మంగళవారం గోనెగండ్లలోని మండల విద్యా వనరుల కేంద్రంలో మండల విద్యాశాఖ అధికారులు రామాంజనేయులు, నీలకంఠలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 25 వేల మంది మండల, క్లస్టరు పాఠశాల స్థాయిలలో గత 18 సంవత్సరాలుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్నామన్నారు. మిగతా డీఎస్సీ అభ్యర్థులతో పాటు అర్హతలు కలిగిన తమకు త్వరలో నిర్వహించనున్న డీఎస్సీలో వెయిటేజీ కల్పిస్తే ఊరట లభించి తమకు మేలు జరుగుతుందన్నారు. కావున రానున్న డీఎస్సీలో తమకు తప్పకుండా వెయిటేజీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రవికుమార్, గోవిందరాజులు, శ్రీనివాసులు, రామాంజనేయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని