logo

Kurnool: బాధితునికి న్యాయం చేయండి

గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల అదే గ్రామానికి చెందిన చెన్నయ్య ఇళ్లు కూలి పోయిందని, బాధితునికి తగిన న్యాయం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, గోస్పాడు మండల కార్యదర్శి హరినాథ్ కోరారు.

Published : 25 Jun 2024 18:01 IST

రైతునగరం (నంద్యాల): గోస్పాడు మండలం యాళ్లూరు గ్రామ పంచాయితీ కార్యదర్శి నిర్లక్ష్యం వల్ల అదే గ్రామానికి చెందిన చెన్నయ్య ఇళ్లు కూలి పోయిందని, బాధితునికి తగిన న్యాయం చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్, గోస్పాడు మండల కార్యదర్శి హరినాథ్ కోరారు. మంగళవారం సీపీఐ గోస్పాడు మండల సమితి నాయకులు నంద్యాల ఆర్డీవో మల్లికార్జున రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోస్పాడు మండలానికి చెందిన చెన్నయ్య కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడన్నారు. ఆయన ఇంటి పక్కనున్న వెంకటేశ్వర్లు నూతనంగా ఇంటి నిర్మాణం కోసం చెన్నయ్య ఇంటిని ఆనుకొని పునాదులు తవ్వడంతో చెన్నయ్య ఇళ్లు ఈ నెల 13న కూలిపోయిందన్నారు. దీంతో బాధితులు నివాసంలేక రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. పునాదులు తవ్వే సమయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. అధికారులు విచారణ జరిపి బాధితునికి న్యాయం చేసి, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. వీరితో పాటు గోస్పాడు సీపీఐ మండల సహాయ కార్యదర్శి జిలానీ బాష, బాధితుడు చెన్నయ్య పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని