logo

ఆర్టీసీ ద్వారా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

Updated : 18 Jun 2024 12:57 IST

డోన్ పట్టణం: ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తోందని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. డోన్ ఆర్టీసీ డిపోకు చెందిన విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు ఏర్పాటుచేసిన రెండు కొత్త సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులను డిపో మేనేజర్ శశి భూషణ్ అధ్యక్షతన ఆయన ముఖ్య అతిథిగా హాజరై మంగళవారం ప్రారంభించారు. డోన్ నియోజకవర్గంలోని ప్రజలకే కాకుండా ఇతర ప్రాంతాల ప్రజలు డోన్ నుంచి తిరుపతి, విజయవాడకు ప్రయాణించేందుకు బస్ సర్వీసులు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించాలని, సంస్థను ఆదరించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఏఎంఎఫ్ పుల్లయ్య, టీఐటూ మోజెస్, పార్టీ నాయకులు లక్కసాగరం లక్ష్మీరెడ్డి, వలసల రామకృష్ణ, తదితరులు, ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని