logo

Kurnool: విద్యార్థుల చదువుకు భరోసా

రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువుకు భరోసా ఇస్తుందని ఆదోని భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు.

Published : 18 Jun 2024 15:08 IST

ఆదోని మార్కెట్: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల చదువుకు భరోసా ఇస్తుందని ఆదోని భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. మంగళవారం స్థానిక ఆర్.ఆర్ లేబర్ కాలనీ పురపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, బ్యాగులను పంపిణీ చేశారు. ప్రభుత్వం అన్ని విధాల విద్యార్థుల చదువుకు ప్రోత్సాహం అందిస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. విద్యారంగంలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారానికి చొరవ చూపుతానన్నారు. కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం బాధ్యుడు మల్లప్ప, ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని