logo

Kurnool: ఫుట్ బాల్ కోచ్‌కు ఆర్థిక సాయం

పట్టణానికి చెందిన ఫుట్ బాల్ కోచ్ మాబుసాబ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.

Updated : 12 Jun 2024 18:03 IST

ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణానికి చెందిన ఫుట్ బాల్ కోచ్ మాబుసాబ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.    ఎమ్మిగనూరు ఫుట్ బాల్ క్లబ్ సభ్యులు కలిసి వైద్యం ఖర్చుల కోసం రూ.లక్ష ఐదు వేల నగదును ఆర్థిక సహాయంగా అందించి మానవత్వం చాటుకున్నారు. భవిష్యత్తులో ఎలాంటి అవసరమున్నా బాధిత కుటుంబానికి వై.ఎఫ్.ఎ క్రీడా సభ్యులు అండగా ఉంటారని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వై.ఎఫ్.సి క్రీడా సభ్యులు విక్రమ్, పెద్దఈరన్న, ప్రసాద్, వీరేష్, ముని, శ్రీనివాసరెడ్డి, నాగరాజు, హనీఫ్, కర్ణకర్ రెడ్డి, శ్రీరాములు, సీజీ ఈరన్న, విజయ్, చాంద్, లతీఫ్, నరసింహారాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని