logo

గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె దగ్ధం

ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె  దగ్ధమైంది. ఈ ఘటన మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది.

Published : 14 Jun 2024 11:39 IST

గాజులపల్లె (మహానంది): ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలి గుడిసె  దగ్ధమైంది. ఈ ఘటన మహానంది మండలం గాజులపల్లె గ్రామంలో శుక్రవారం జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పాల ఆదిలక్షమ్మ కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తెల్లవారుజామున ఇంట్లో ఆదిలక్ష్మమ్మ, తన కుమారుడు నరసింహుడు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు మంటలార్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న నంద్యాల అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అప్పటికే  పూరి గుడిసె పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గుడిసెలో ఉన్న  సుమారు రూ.40 వేల నగదు, బంగారం, సామగ్రి కాలిబూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో  సుమారు రూ. లక్షపైనే ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు తెలిపింది. తమని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని