logo

Kurnool:: మంత్రి, ఎంపీకి జ్ఞాపికలు బహుకరణ

రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరీలను మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర రెడ్డి, వేద పండితుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి ప్రసాదాలు అందించి జ్ఞాపికలను బహూకరించారు.

Updated : 15 Jun 2024 18:09 IST

మహానంది: రాష్ట్ర మైనారిటీ న్యాయశాఖ మంత్రి ఎన్ ఎండీ ఫరూక్, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరీలను మహానంది దేవస్థానం ఈవో కాపు చంద్రశేఖర రెడ్డి, వేద పండితుల బృందం మర్యాదపూర్వకంగా కలిసి ప్రసాదాలు అందించి జ్ఞాపికలను బహూకరించారు. శనివారం నంద్యాలలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మంత్రి, ఎంపీలతో మాట్లాడుతూ మహానంది దేవస్థానం అభివృద్ధికి రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం తరఫున కృషి చేయాలని కోరారు. వారితోపాటు తెదేపా రాష్ట్ర కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది తులసి రెడ్డిని సత్కరించారు. దైవ దర్శనానికి రావలసిందిగా ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు