logo

సింగిల్‌ విండో అధ్యక్షుడికి సన్మానం

మండల కేంద్రమైన సీ బెలగల్‌లో గురువారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో సింగిల్‌ విండో అధ్యక్షుడి ఏ.గోపాల్‌రెడ్డిని ఆ సంఘం సభ్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.

Published : 13 Jun 2024 12:27 IST

సీబెలగల్‌ : మండలకేంద్రమైన సీ బెలగల్‌లో గురువారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం కార్యాలయంలో సింగిల్‌ విండో అధ్యక్షుడి ఏ.గోపాల్‌రెడ్డిని ఆ సంఘం సభ్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వ్యవసాయ పరపతి సంఘం సీఈవోలు రవికుమార్‌రెడ్డి, ఖాజా సిబ్బంది శేఖర్‌, శివ శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సీఈవోలు మాట్లాడారు. వ్యవసాయ పరపతి సంఘానికి అధ్యక్షుడిగా గోపాల్‌రెడ్డి 2013 నుంచి బాధ్యతలు నిర్వహించారని తెలిపారు. రైతులకు  పంట రుణాలు ఇచ్చి ఆదుకున్నారని, దీర్ఘకాలిక పంట రుణాలు , రైతు నేస్తం, వ్యక్తిగత రుణాలు ఇచ్చారని తెలిపారు. ఆయన హాయాంలో వ్యవసాయ పరపతి సంఘం తరఫున 16 దుకాణాలు నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు సీవీ గోవిందరెడ్డి, రైతులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని