logo

జనసేన ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు

మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ గ్రామంలో  జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు.

Published : 14 Jun 2024 11:41 IST

మహానంది: మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ గ్రామంలో  జనసేన నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. ఇటీవల జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాల్లో  100% విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహానంది మండలం గాజులపల్లి ఆర్ఎస్ గ్రామంలో  రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని యువకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు విజయ్  మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో రోగులు, క్షతగాత్రులకు అవసరమైన రక్తాన్ని అందించి ఊపిరి పోసే ప్రాణదాతలుగా నిలవాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, జనసేన, తెదేపా యువకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని