logo

Kurnool: పీఎం కిసాన్‌ నిధి విడుదలపై ప్రత్యక్ష ప్రసారం

మండల కేంద్రంలోని గోనెగండ్ల రైతు భరోసా కేంద్రం నందు ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి రైతుల ఖాతా నందు నగదు జమ చేసే కార్యక్రమం లైవ్ ప్రసారాన్ని మండల వ్యవసాయ అధికారి హేమలత ఏర్పాటు చేశారు.

Updated : 18 Jun 2024 19:20 IST

గోనెగండ్ల: మండల కేంద్రంలోని గోనెగండ్ల రైతు భరోసా కేంద్రం నందు ప్రధాన మంత్రి సమ్మాన్ నిధి రైతుల ఖాతా నందు నగదు జమ చేసే కార్యక్రమం లైవ్ ప్రసారాన్ని మండల వ్యవసాయ అధికారి హేమలత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ హైమావతి, మండల తెదేపా నాయకుల అధ్యర్యంలో నిర్వహించారు. రైతుల ఖాతాలకు ప్రధానమంత్రి సమ్మాన్ నిధి సొమ్ము జమ చేసినట్లు వ్యవసాయ అధికారిని పేర్కొన్నారు. రైతులు ఖరీఫ్ సీజన్‌లో సాగు చేసే పంటలకు వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని