logo

నంద్యాల ప్రజల నీటి కష్టాలు త్వరలోనే తీరుస్తాం : మంత్రి

నంద్యాలలో ప్రజల నీటి కష్టాలను త్వరలోనే తీరుస్తామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరుక్ పేర్కొన్నారు.

Published : 16 Jun 2024 15:02 IST

నంద్యాల పురపాలకం : నంద్యాలలో ప్రజల నీటి కష్టాలను త్వరలోనే తీరుస్తామని న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరుక్ పేర్కొన్నారు. ఆదివారం పట్టణం శివార్లలో మహానంది రోడ్డులో ఉన్న అమృత్ ఫేస్ వన్ పనులను, ఫిల్టర్ బెడ్‌లను , సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్‌ను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమృత్ ఫేస్1 పనులను 2017లో  రూ రూ.150 కోట్లతో అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. రానున్న రోజుల్లో నంద్యాల పట్టణానికి ఎలాంటి తాగునీటి ఇబ్బంది లేకుండా చేస్తానన్నారు. ప్రధాని మోదీ , ముఖ్యమంత్రి చంద్రబాబు  సహకారంతో నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఆయన వెంట పురపాలక కమిషనర్ నిరంజన్ రెడ్డి, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని