logo

అందరూ పట్టణ అభివృద్ధికి సహకరించాలి

పట్టణంలో అభివృద్ధి పనుల కోసం  అధికారులందరూ సహరించాలని  ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు.

Published : 15 Jun 2024 11:23 IST

ఎమ్మిగనూరు: పట్టణంలో అభివృద్ధి పనుల కోసం  అధికారులందరూ సహరించాలని  ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం పురపాలక సంఘం కార్యాలయంలో  అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ  ప్రస్తుతం పట్టణంలో చేపట్టే  పనులను  వేగవంతం చేయాలన్నారు. త్వరలోనే పులికల నుంచి తాగు నీటిని విడుదల చేయిస్తానని  తెలిపారు. పట్టణంలో అభివృద్ధి పనుల  విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కమిషనర్  గంగిరెడ్డి, డి మనోహర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని