logo

వైకాపా నాయకుల తీరుతోనే హింసాత్మక ఘటనలు

వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు.

Published : 17 May 2024 04:33 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గఫూర్‌

కర్నూలు (వెంకటరమణ కాలనీ), న్యూస్‌టుడే : వైకాపా నాయకుల తీరు కారణంగానే రాష్ట్రంలో ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని కర్నూలు మాజీ ఎమ్మెల్యే, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్‌ అన్నారు. ఆయన గురువారం కర్నూలులో మాట్లాడారు. ఎన్నికల అనంతరం రాష్ట్రంలో హింస చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. మాచర్ల, తాడిపత్రి, తిరుపతిలో దాడులకు వైకాపానే కారణమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలపై వైకాపా వారు ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం దురదృష్ణకరమన్నారు. పోలీసులు వెంటనే నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడులు అరికట్టాలని డిమాండ్‌ చేశారు. రాజంపేటలో ఉన్న పోలీసు అధికారి తాడిపత్రికి వచ్చి ఎలా దాడులు చేస్తారని ప్రశ్నించారు. తక్షణమే సదరు పోలీసు అధికారిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ఓటింగ్‌ శాతం పెరిగిందని.. దూర ప్రాంతాల నుంచి సొంత ఖర్చులతో ఓట్లేసేందుకు జనం తరలివచ్చారని తెలిపారు. ఓటింగ్‌ శాతం పెరగడం కూటమికే అనుకూలమని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని