logo

స్ట్రాంగ్‌ రూమ్‌ల ఎదుట నిరంతర నిఘా: కలెక్టర్‌

పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 19 May 2024 04:53 IST

కమాండ్‌ కంట్రోల్‌ రూంలో సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్న కలెక్టర్, ఎస్పీ 

పాణ్యం గ్రామీణం, న్యూస్‌టుడే: పార్లమెంట్, శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌ రూంల ఎదుట 24 గంటలు నిరంతర నిఘా ఉంచినట్లు కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, ఎస్పీ రఘువీర్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్, పార్మసీ కళాశాలను తనిఖీ చేసి కమాండ్‌ కంట్రోల్‌ రూంను పరిశీలించారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేంత వరకు స్ట్రాంగ్‌రూంల వద్ద అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. శాంతిరాం, ఆర్జీఎం ఇంజినీరింగ్, పార్మసీ కళాశాలల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉందన్నారు. జిల్లాలో ఎవరైనా హింసాత్మక ఘటనలకు పాల్పడినా, విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎక్కడా కూడా నలుగురు, అంతకు మించి గుంపుగా ఉండొద్దని, అనుమతులు లేకుండా సభలు, ప్రచారాలు నిర్వహించొద్దన్నారు. జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, నంద్యాల డీఎస్పీ రవీంద్రనాథ్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ సంతోష్, ఏఆర్‌ డీఎస్పీ శ్రీనివాసులు, సీఐలు వెంకటేశ్వరరావు, నల్లప్ప, ఎస్సై అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని