logo

సమష్టి కృషితో అద్భుత ఫలితాలు

నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు..  ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర చరిత్రలో గొప్పగా నిలిచిందని.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు చొరవ చూపారని.. వారిచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.

Published : 12 Jun 2024 02:19 IST

తెదేపా అధినేత చంద్రబాబు

వేదికపై తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : నూటికి నూరు శాతం మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేశారు..  ఓటర్లు ఇచ్చిన తీర్పు రాష్ట్ర చరిత్రలో గొప్పగా నిలిచిందని.. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు ప్రజలు చొరవ చూపారని.. వారిచ్చిన తీర్పును నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడలోని ఎ-1 కన్వెన్షన్‌ సెంటరులో తెదేపా-జనసేన-భాజపా కూటమి శాసనసభాపక్ష భేటీ మంగళవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదని చెప్పారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 ఎమ్మెల్యే సీట్లు గెలుపొందడం సంతోషకరమన్నారు. అందరం ప్రజల కోసం పనిచేద్దామని పేర్కొన్నారు. 

లోకేశ్‌తో బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి

ఈ సమావేశానికి ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి ఎన్‌ఎండీ ఫరూక్‌ (నంద్యాల), కోట్ల జయసూర్యప్రకాష్‌రెడ్డి (డోన్‌), బీసీ జనార్దన్‌రెడ్డి (బనగానపల్లి), భూమా అఖిలప్రియ (ఆళ్లగడ్డ), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (శ్రీశైలం),  గిత్తా జయసూర్య (నందికొట్కూరు), గౌరు చరితారెడ్డి (పాణ్యం), టీజీ భరత్‌ (కర్నూలు), బొగ్గుల దస్తగిరి (కోడుమూరు), బి.వి.జయనాగేశ్వరరెడ్డి (ఎమ్మిగనూరు), కేఈ శ్యాంబాబు (పత్తికొండ), భాజపా ఎమ్మెల్యే డా.పార్థసారథి (ఆదోని), ఎమ్మెల్సీ బీటీ నాయుడు, కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ తెదేపా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, మల్లెల రాజశేఖర్‌ తదితరులు హాజరయ్యారు.  కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్‌ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ శాసనసభాపక్ష నేతతోపాటు సీఎం అభ్యర్థిగా చంద్రబాబునాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.


ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖరెడ్డి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు