logo

బడికి వేళైంది.. సందడి మొదలైంది

వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో మార్కెట్‌లో సందడి మొదలైంది.

Published : 13 Jun 2024 02:29 IST

నోటు పుస్తకలు, పెన్నుల కోసం..

వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. దీంతో మార్కెట్‌లో సందడి మొదలైంది. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, క్యారీ బ్యాగులు, స్కూల్‌ బ్యాగులు, కొత్త దుస్తులు, బూట్లు ఇతర సామగ్రి కొనుగోళ్లు ఊపందుకున్నాయి. జిల్లా కేంద్రం నంద్యాల పట్టణంలోని పలు దుకాణాలు బుధవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కిటకిటలాడాయి. కొత్త పుస్తకాలు, వస్తువులు కొన్న ఆనందంలో పిల్లలు ఉబ్బితబ్బిబ్బవుతోంటే.. మరోవైపు పెద్దలు ఖాళీ అయిన జేబులను చూసుకుంటూ ఇంటి ముఖం పట్టారు.

న్యూస్‌టుడే, నంద్యాల బొమ్మలసత్రం


స్కూల్‌ బ్యాగుల కొనుగోలు


చిన్నా.. ఈ బ్యాగు సరి పోతుందా..


ట్రంకుపెట్టెలు తీసుకెళుతున్న హాస్టల్‌ విద్యార్థులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని