logo

జాలువారిన జలపాతం.. ఉప్పొంగెను ప్రతి హృదయం

నియోజకవర్గంలోని అవుకు మండలం మంగంపేట గ్రామ శివారులోని జలపాతం బుధవారం పర్యాటకులను ఆకర్షిస్తోంది.

Published : 13 Jun 2024 02:32 IST

నియోజకవర్గంలోని అవుకు మండలం మంగంపేట గ్రామ శివారులోని జలపాతం బుధవారం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇటీవల  కురిసిన వర్షాలకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో చేరి వీక్షిస్తున్నారు. కొండకోనల మధ్య ఉన్న జలపాతంలో స్నానాలు చేశారు.

న్యూస్‌టుడే, మంగంపేట (బనగానపల్లి గ్రామీణం)


పచ్చిటెంకాయపై పీఎం, సీఎం, పవన్‌ చిత్రాలు

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే : నారా చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకారం పురస్కరించుకొని నందికొట్కూరుకు చెందిన దేశెట్టి శ్రీనివాసులు బుధవారం పచ్చిటెంకాయపై ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని నరేంద్రమోదీ,  పవన్‌ కల్యాణ్‌ చిత్రాలు గీశారు.


కుందూకు జలకళ

కోవెలకుంట్లలోని కుందూనది జలకళను సంతరించుకొంది. ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది వేసవిలో చుక్కనీరు లేక పూర్తిగా ఎండిపోయింది. నదీతీర ప్రాంత గ్రామాల రైతులు సాగునీటికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. తీర ప్రాంతాల రైతులు పంటల సాగుకు సమాయత్తం అవుతున్నారు.

న్యూస్‌టుడే, కోవెలకుంట్ల


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని