logo

సార్వత్రిక ఎన్నికలు సమర్థంగా నిర్వహణ

కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను కలెక్టర్‌ డా.జి.సృజన, జేసీ ఎన్‌.మౌర్య  సమర్థంగా నిర్వహించారని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిరికుమార్‌రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజు అన్నారు.

Published : 13 Jun 2024 02:38 IST

జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజనను అభినందిస్తున్న ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా నాయకులు

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను కలెక్టర్‌ డా.జి.సృజన, జేసీ ఎన్‌.మౌర్య  సమర్థంగా నిర్వహించారని ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గిరికుమార్‌రెడ్డి, నాగరాజు, రాష్ట్ర కార్యదర్శి వెంకటరాజు అన్నారు. బుధవారం ఏపీఆర్‌ఎస్‌ఏ జిల్లా సంఘం తరఫున కృతజ్ఞతాభినందనలు వారు తెలిపారు. జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన, జేసీ నారపురెడ్డి మౌర్య, ట్రైనీ కలెక్టర్‌ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధన్‌రావులకు విడివిడిగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు, ఆదోని డివిజన్ల అధ్యక్షులు రామాంజనేయులు, రజనీకాంతరెడ్డి, వేణుగోపాల్‌రావు, కలెక్టరేట్‌ యూనిట్‌ కార్యదర్శి లోకేశ్వరరెడ్డి, ధనుంజయరెడ్డి, మహిళా నాయకులు లోకేశ్వరి, శివపార్వతి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని