logo

అందని విద్యా కానుక

బడి తెరిచే నాటికి విద్యా కానుక అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా సామగ్రి మండల కేంద్రాలకు చేరుకోలేదు.

Published : 13 Jun 2024 02:41 IST

బడి తెరిచే నాటికి విద్యా కానుక అందిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ ఇప్పటికీ చాలా సామగ్రి మండల కేంద్రాలకు చేరుకోలేదు. అసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఏటా బడులు ప్రారంభం రోజే విద్యా కానుక కిట్లు అందజేస్తామని చెబుతున్నా బడులు తెరిచిన తర్వాత కూడా కొన్ని వస్తువులు అందడానికి నెలలు పడుతోంది. ఈ ఏడాదైనా సకాలంలో విద్యా సామగ్రి అందే పరిస్థితి కనిపించడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

న్యూస్‌టుడే, కర్నూలు, నంద్యాల విద్య

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత స్థాయిలో సుమారు 2,858 బడులు ఉన్నాయి. ఇందులో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు సుమారు 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి విద్యా కానుక కింద రెండు జతల దుస్తులు, నోట్, పాఠ్య పుస్తకాలు, బెల్టులు, పాదరక్షలతోపాటు ఒకటో తరగతి విద్యార్థికి పిక్టోరియల్‌ పుస్తకం, 6వ తరగతి విద్యార్థికి ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలు ఇవ్వాలి. ఉమ్మడి జిల్లాకు ప్రతిపాదించిన వాటిలో ఇప్పటి వరకు 45 శాతం మాత్రమే వచ్చినట్లు సమాచారం.

పాఠ్య పుస్తకాల ప్రతిపాదన

మొదటి విడత: కర్నూలు జిల్లాకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 12,58,671 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా 2,11,034 వచ్చాయి. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు 9,40,682 పాఠ్య పుస్తకాలు అవసరమని అధికారులు నివేదించారు. నంద్యాల జిల్లాకు 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు 6,58,397 పాఠ్య పుస్తకాలు అవసరం కాగా 2,40,587 పుస్తకాలొచ్చాయి. 8వ తరగతి నుంచి పదో తరగతి వరకు 6,29,133 పాఠ్య పుస్తకాలు అవసరం. ఈ పుస్తకాలు రాష్ట్ర ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి నేరుగా బడులకు సరఫరా అవుతాయని పాఠ్యపుస్తక మేనేజర్‌ భారతి తెలిపారు.
రెండో విడత: కర్నూలు జిల్లాకు 3,17,990, నంద్యాల జిల్లాకు 3,54,404 వచ్చాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని