logo

ఊరూరా ప్రమాణ పండగ

ఐదేళ్ల తర్వాత ఊరూ.. వాడా.. తెదేపా జెండా ఎగిరింది.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా అంతటా పండగ వాతావరణం నెలకొంది.

Updated : 13 Jun 2024 05:28 IST

తెలుగు తమ్ముళ్ల నూతనోత్సాహం

ఆదోని: పట్టణంలో ఎన్డీఆర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు

ఐదేళ్ల తర్వాత ఊరూ.. వాడా.. తెదేపా జెండా ఎగిరింది.. నాలుగోసారి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయడంతో జిల్లా అంతటా పండగ వాతావరణం నెలకొంది. ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు తిలకించడానికి భారీ ఎల్‌ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. తెదేపా నేతలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

న్యూస్‌టుడే కర్నూలు సచివాలయం

ఆలూరు: పట్టణంలో నాయకులు, కార్యకర్తల ద్విచక్రవాహన ర్యాలీ

 


ఉద్యోగుల సంబరం

కొండారెడ్డి బురుజు వద్ద తెదేపా జెండా పట్టుకుని నృత్యాలు చేస్తున్న కార్యకర్తలు

కొత్త ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా ఏపీ ఎన్జీవో సంఘం, ఏపీ ఐకాస ఛైర్మన్‌ వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ దగ్గర ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు.  వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతలు కలెక్టరేట్‌ ఎదుట బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచిపెట్టారు.

కర్నూలు బి.క్యాంప్, న్యూస్‌టుడే


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని