logo

సేవా గుణంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తి

ప్రజలకు వార్తా సమాచారం అందించడంతోపాటు సేవా దృక్పథంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్‌ బాషా అన్నారు.

Updated : 14 Jun 2024 05:06 IST

వృద్ధురాలికి వస్త్రాలు అందజేస్తున్న సీఈ కబీర్‌ బాషా

కర్నూలు నగరం, న్యూస్‌టుడే: ప్రజలకు వార్తా సమాచారం అందించడంతోపాటు సేవా దృక్పథంలో రామోజీరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్‌ బాషా అన్నారు. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారని, ఆయన లేని లోటు బాధాకరమన్నారు. సీఈ గురువారం కర్నూలులోని రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్మించిన శిర్డి సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. వృద్ధులతో మాట్లాడి వసతులు, ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన వెంట ఉప సీఈ లక్ష్మానాయక్, సీఈ కార్యాలయ పర్యవేక్షకులు కమలాకర్, సీసీ వెంకటేశ్వర్లు, ఆశ్రమం నిర్వాహకులు బత్తిని శ్రీనివాసులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని