logo

ఉద్యోగుల సస్పెన్షన్లు ఎత్తివేయాలి

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన విజయవంతంగా పని చేశారని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి కొనియాడారు.

Published : 14 Jun 2024 02:06 IST

కలెక్టర్, జేసీలకు విన్నపాలు

కలెక్టర్, జేసీలకు పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించిన ఏపీ ఎన్జీజీవో సంఘం నేతలు 

ర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన విజయవంతంగా పని చేశారని ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా అధ్యక్షులు వీసీహెచ్‌ వెంగళ్‌రెడ్డి కొనియాడారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు అన్ని విధాలుగా వసతులు, బస్సుల సౌకర్యాలు కల్పించారన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏపీ ఎన్జీవో పక్షాన వెంగళ్‌రెడ్డి, ఏపీ జేఏసీ రాష్ట్ర సెక్రటరీ జనరల్‌ హృదయరాజు, జిల్లా, నగర కార్యవర్గాల నాయకులు జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజనను కలిసి సత్కరించి అభినందించారు.  కలెక్టర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇటీవల ఎన్నికలలో ఉద్యోగులు ఎన్నికల విధులకు గైర్హాజరైనందున 80 మందికిపైగా సస్పెన్షన్‌ విధించారని, అయితే ఇది చిన్న తప్పుగా భావించి సస్పెన్షన్లను ఎత్తి వేసి ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకుండా చూడాలని ఏపీ జేఏసీ పక్షాన వారు వినతిపత్రం అందించారు. కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని, దీనిపై వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం వారు జేసీ నారపురెడ్డి మౌర్యను కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జవహర్‌లాల్, నగర అధ్యక్ష, కార్యదర్శులు ఎంసీ కాశన్న, రామకృష్ణ, కోడుమూరు అధ్యక్షులు శ్రీనివాసు, రవిప్రకాష్‌ (వ్యవసాయ), వెంకటేశ్వర్లు (పారా వెట్స్‌), మద్దిలేటి (నాలుగో తరగతి), నాగేశ్వరరావు (ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం), ఈశ్వరయ్య (మెడికల్‌ ఎంప్లాయిస్‌), జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్‌రెడ్డి, చిరంజీవి, కృష్ణుడు, మధు, జనార్ధన్‌రెడ్డి, శ్రీనివాసులు, సాయిరాం, రాఘవేంద్ర, సుభాషిణి, కలెక్టరేట్‌ కార్యాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని