logo

వరద.. అధికారుల అప్రమత్తత

తుంగభద్ర వరదపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవాహ వివరాలు ఎప్పటికప్పుడు వెంటనే తెలియజేయాలని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్‌ బాషా ఆదేశించారు.

Published : 14 Jun 2024 02:29 IST

సుంకేసుల బ్యారేజీ వద్ద కేసీసీ ఇంజినీర్లు తిరుమలేశ్‌రెడ్డి, రఘురామిరెడ్డిలకు సూచనలు ఇస్తున్న సీఈ కబీర్‌ బాషా

కర్నూలు జలమండలి, న్యూస్‌టుడే: తుంగభద్ర వరదపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. వరద ప్రవాహ వివరాలు ఎప్పటికప్పుడు వెంటనే తెలియజేయాలని జలవనరుల శాఖ కర్నూలు సీఈ కె.కబీర్‌ బాషా ఆదేశించారు. గురువారం సాయంత్రం సీఈ సుంకేసుల జలాశయాన్ని పరిశీలించారు. 26, 29వ గేట్లు సరిగా పని చేయడం లేదు.. వెంటనే మరమ్మతులు చేయించాలని ఇంజినీర్లను ఆదేశించారు.  2, 3 గేట్లు లీకేజీలు అవుతున్నాయి.. వెంటనే రబ్బరు సీళ్లు వేయాలన్నారు. బ్యారేజీ వద్ద చేసే పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు.. ఈమేరకు గేట్ల మరమ్మతులు, కేబుళ్లను ఏర్పాటు చేసుకోలేకపోతున్నామని ఇంజినీర్లు సీఈకి తెలిపారు.  కేసీసీ ఈఈ తిరుమలేశ్, కర్నూలు డీఈఈ రఘురామిరెడ్డి తదితరులు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు