logo

ఎల్లార్తి దర్గా ఈవోపై దాడి

హొళగుంద మండలంలో ప్రసిద్ధి గాంచిన ఎల్లార్తి షేక్షావలి, షాషావలి దర్గా ఓ వర్గం పరిధిలో కార్యకలాపాలు సాగేవి.

Published : 15 Jun 2024 03:27 IST

హొళగుంద,  న్యూస్‌టుడే: హొళగుంద మండలంలో ప్రసిద్ధి గాంచిన ఎల్లార్తి షేక్షావలి, షాషావలి దర్గా ఓ వర్గం పరిధిలో కార్యకలాపాలు సాగేవి. తరుచూ వివాదాలు తలెత్తడం ఏడాది కిందట వైకాపా ప్రభుత్వం ప్రత్యేకంగా దర్గాకు కార్యనిర్వహణాధికారిగా అబ్దుల్‌ రహిమాన్‌ను నియమించింది. దీంతో దర్గా పరిధిలో పలు వ్యాపారాల నిర్వహణ, క్రయవిక్రయాల నుంచి వచ్చే ఆదాయం ప్రభుత్వాధీనంలోకి వెళ్లడంతో.. ఈ నెల 21వ తేదీన అధికారులు టెండర్‌ నిర్వహణకు  సన్నాహాలు చేపట్టారు. గతంలో దర్గా నిర్వహణ బాధ్యత చూస్తున్న మల్లికార్జున సొంత స్థలంలో దాతల సహకారంతో పది మరుగుదొడ్లు నిర్మించారు. దర్గా పరిధిలోని వసతి గదులతో పాటు, మరుగుదొడ్ల నిర్వహణకు టెండర్‌ పిలిచారు. మరుగుదొడ్లు తమ స్థలంలో ఉన్నాయని, టెండర్‌  ఎలా నిర్వహిస్తారని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఇందులో భాగంగా శుక్రవారం జిల్లా మైనారిటీ సంక్షేమ అభివృద్ధి అధికారి సునీల్, ఈవో అబ్దుల్‌ రహిమాన్‌ను, ఎస్సై పెద్దయ్య నాయుడు ఆధ్వర్యంలో ఈవో కార్యాలయంలో స్థానికులతో సమావేశం నిర్వహించారు. దీనిపై అధికారులు మాట్లడుతూ.. దర్గా నిర్వహణ కింద తప్పనిసరిగా టెండర్‌ను నిర్వహించాల్సిందేనని  అధికారులు తేల్చిచెప్పారు. సమావేశం అనంతరం దర్గా ఈవోనే గ్రామంలో చిచ్చు పెడుతున్నారని ఆయనపై మల్లికార్జున, రవి, ఆంజనేయులు, భీమలింగ, భుజంగతో పాటు మరో 15 మంది దర్గాలోనే రాళ్లతో, కర్రలతో దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు పరిస్థితిని అదుపు చేశారు. దాడిచేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని