logo

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి

సమాజంలో యువతకు రక్తదానంపై అపోహలతో ముందుకు రావడం లేదని, వాటిని వీడి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన అన్నారు.

Published : 15 Jun 2024 03:29 IST

మండల, డివిజన్‌ స్థాయిలో శిబిరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్‌ 

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: సమాజంలో యువతకు రక్తదానంపై అపోహలతో ముందుకు రావడం లేదని, వాటిని వీడి రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ డా.జి.సృజన అన్నారు. శుక్రవారం కర్నూలులోని రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆవరణలో ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ వారితో కలిసి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. మండల, డివిజన్‌ స్థాయిల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు, రెడ్‌క్రాస్‌ సొసైటీ వారికి ఆమె సూచించారు. రక్తదానం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. చాలా మంది యువత అపోహలతో రక్తదానం చేసేందుకు వెనుకాడుతున్నారని, అటువంటివి వీడి రక్తదాతలుగా మారి ఇతరులకు జీవితాన్నిచ్చిన వారు కావాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఏటా సుమారు 5 కోట్లు బ్లడ్‌ బ్యాగులు అవసరం కాగా కేవలం 3.5 కోట్లు మాత్రమే  ఇవ్వలుగుతున్నామని తెలిపారు. అవసరమైన వారందరికీ రక్తాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకొని రక్తదానం చేయాలన్నారు. అనంతరం రక్తదానాన్ని ప్రోత్సహించినవారికి కలెక్టర్‌ జ్ఞాపికలు బహూకరించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డ్వామా పీడీ అమర్‌నాథ్‌రెడ్డి, అదనంపు డీఎంహెచ్‌వో డాక్టర్‌ భాస్కర్, రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ ఛైర్మన్‌ శ్రీనివాసులు, కేవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని